జార్ఖండ్‌లో గిరిజన యువుకుల అరాచకం

వీధినాటకం వేస్తున్న మహిళల కిడ్నాప్‌

ఆపై సామూహిక అత్యాచరం..పోలీసుల దర్యాప్తు

రాంచీ,జూన్‌22(జ‌నం సాక్షి ): వీదినాటకంతో ప్రజల్లో మార్పు తీసుకుని వచ్చేందుకు చేస్తున్న మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్న ఐదుగురు మహిళలను ఎత్తుకెళ్లి.. వీరిలో ముగ్గురిపై కొంతమంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జార్ఖండ్‌ రాజధాని రాంచీకి 50 కిలోవిూటర్ల దూరంలో ఉన్న కొచాంగ్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కొచాంగ్‌ ప్రాంతానికి 11 మంది సభ్యులున్న ఓ ఎన్జీవో సంస్థ వెళ్లింది. అక్కడున్న మహిళలకు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమయంలో అక్కడికితుపాకులతో చేరుకున్న కొంతమంది మగాళ్లు వారిని బెదిరించారు. ఆ తర్వాత సంస్థ సభ్యుడైన ఒక వ్యక్తిని తీవ్రంగా చితకబాదారు. అనంతరం ఐదుగురు మహిళలను సవిూపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. వీరిలో ఉన్న ఇద్దరు నన్స్‌ను వదిలేసి మిగతా ముగ్గురిపై సామూహిక అత్యాచారం చేశారు. మూడు గంటల తర్వాత మహిళలను వదిలేశారు. ఈ ఘటనను ఆ మృగాళ్లు వీడియో తీశారు. విషయం బయటకు చెబితే వీడియోలు బయటపెడుతామని బెదిరించారు. మొత్తానికి ఈ విషయం ఎన్జీవో సంస్థకు తెలియడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలకు వైద్యపరీక్షలు నిర్వహించగా.. వారు అత్యాచారానికి గురైనట్లు తేలింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ వారు పతల్‌గడి అనే గిరిజన వర్గానికి చెందినవారిగా తెలుస్తోంది. ఈ తెగకు చెందిన వారు రాష్ట్రంలో అమలయ్యే నిబంధనలు పాటించరు. వారికంటూ నిర్దేశిరచుకున్న గిరిజన నియమనిబంధనల కిందే గ్రామ పాలన జరుగుతుంది. బయటి వ్యక్తులను తమ గ్రామాల్లోకి ప్రవేశించేందుకు అనుమతించరని పోలీసులు వివరించారు.