జింబాబ్వేతో ఐదు వన్డేలు ఆడనున్న భారత్‌

ముంబై ,జూన్‌ 20 (జనంసాక్షి) :

జింబాబ్వేలో భారత క్రికెట్‌ జట్టు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. జూలై 24 నుండి మొదలయ్యే టూర్‌లో టీమిండియా ఐదు వన్డేలు ఆడనుంది. వెస్టిండీస్‌లో ట్రై సిరీస్‌ ముగిసిన తర్వాత భారత్‌ ఆడబోయే సిరీస్‌ ఇదే. మొదటి మూడు వన్డేలకూ హరారే ఆతిథ్యమివ్వనుండ గా… చివరి రెండు వన్డేలు బులవాయోలో జరగనున్నా యి. అయితే ఈ పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. సీనియర్లంతా వి శ్రాంతి తీసుకునే అవకాశముండడంతో బోర్డు ఈ నిర్ణ యం తీసుకోనుంది. 2010లో కూడా జింబాబ్వే టూర్‌కు సురేష్‌రైనా సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టునే పంపించారు.

షెడ్యూల్‌ ః

జూలై  24 – మొదటి వన్డే – హరారే

జూలై 26  – రెండో వన్డే   – హరారే

జూలై 28  – మూడో వన్డే  – హరారే

జూలై 31  – నాలుగో వన్డే – బులవాయో

ఆగష్ట్‌ 3   – ఐదో వన్డే     – బులవాయో