జియోకు అద్భుతమైన స్పందన వస్తుంది

– ఇప్పటివరకు 21.5కోట్ల మంది కస్టమర్లను పొందగలిగాం
– 2.5కోట్ల యూనిట్లు జియోఫోన్‌లు విక్రయించాం
– ఆగస్టు 15 నుంచి ఫేస్‌బుక్‌, వాట్సప్‌, య్యూటూబ్‌ అందుబాటులోకి తెస్తాం
– అదే రోజు నుంచి ఫైబర్‌ కోసం రిజిస్టేష్రన్లను ప్రారంభిస్తాం
– రిలయన్స్‌ సంస్థ 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ ముఖేశ్‌ అంబాని
– జీయోఫోన్‌-2ను ఆవిష్కరించిన అంబాని
ముంబాయి, జులై5(జ‌నం సాక్షి) : జియోకు అద్భుతమైన స్పందన వస్తుందని కంపెనీ చైర్మన్‌ ముఖేశ్‌ అంబాని అన్నారు. గురువారం ముంబయిలో సంస్థ 41వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘జియోఫోన్‌ 2’ను ఆవిష్కరించారు. దీంతో పాటు జియోగిగా సెటాప్‌ బాక్స్‌, జియో గిగ్గా/బైర్‌ను కూడా విడుదల చేశారు.  ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ మాట్లాడారు. ‘బ్రాడ్‌బ్యాండ్‌లో ఉత్తమమైన సేవలందించేందుకు హైస్పీడ్‌ ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. జియో గిగా ఫైబర్‌ పేరుతో బ్రాడ్‌బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి తెస్తామన్నాని, ఆగస్టు 15 నుంచి ఈ ఫైబర్‌ కోసం రిజిస్టేష్రన్లను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఫైబర్‌ 5కోట్ల ఇళ్లకు కనెక్ట్‌ చేయగల సామర్థ్యం గలదని తెలిపారు. రిలయన్స్‌ జియోకు అద్భుతమైన స్పందన వచ్చిందని.. ఇప్పటివరకు జియోకు 21.5కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని తెలిపారు. అంతేగాక గతేడాది విడుదల చేసిన జియోఫోన్‌ ఇప్పటివరకు 2.5కోట్ల యూనిట్లు విక్రయమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న జియోఫోన్‌లలో ఆగస్టు 15 నుంచి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ను అందిస్తామన్నారు.
రూ.2,999కే జియో-3 ఫోన్‌..
జియో ఫోన్‌ 2 ధర రూ.2,999 గా నిర్ణయించినట్లు ముకేష్‌ వెల్లడించారు. ఈ ఫోన్‌ ఆగస్టు 15వ తేదీ నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఫోన్‌కు గాను బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని, ఇప్పటికే జియో ఫోన్‌ను వాడేవారు రూ.501 అదనంగా చెల్లిస్తే దాంతో జియో ఫోన్‌ 2 ను సొంతం చేసుకోవచ్చని తెలిపారు. జియో ఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ కింది ఎక్స్‌ఛేంజ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. జియో ఫోన్‌ 2 లో ఫీచర్ల విషయానికి వస్తే.. 2.4 ఇంచుల డిస్‌ప్లే, కాయ్‌ ఓఎస్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీ వీవోఎల్‌టీఈ, వీవోవ్గై/, ఎన్‌ఎఫ్‌సీ తదితర ఫీచర్లు జియో ఫోన్‌ 2 లో లభిస్తున్నాయి. ఈ ఫోన్‌ డిస్‌ప్లే కింది భాగంలో క్వర్టీ కీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోన్‌ బ్లాక్‌బెర్రీ క్వర్టీ ఫోన్‌ను పోలి ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ యాప్స్‌ పనిచేస్తాయి. అంతేకాకుండా వాయిస్‌ కమాండ్లను ఇచ్చేందుకు ప్రత్యేకంగా బటన్‌ను ఏర్పాటు చేశారు.