జిల్లాకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి….. డీఈవో గోవిందరాజులు
నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో విద్యార్థులకు ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను ప్రారంభిస్తున్నట్లు డిఇఓ తెలిపారు మంగళవారం నాగర్ కర్నూలు పట్టణంలోని ఉయ్యాలవాడ మాడ్రన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటుచేసిన పాఠ్యపుస్తకాల గోడౌను డిఇఓ గోవిందరాజులు పరిశీలించారు.
ఈ సందర్భంగా డి ఈ ఓ మాట్లాడుతూ భాగంగా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాలను జిల్లాకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జిల్లాకు సుమారు 4,53,826 వరకు పాఠ్యపుస్తకాలు అవసరం కానున్నాయని,ఆ పుస్తకాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి, రాష్ట్ర విద్యాశాఖకు ఇదివరకే ఇండెంట్ పంపించామన్నారు. అందులో 1,67,140 పుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరాయని, ఈ పుస్తకాల ను జిల్లా కేంద్రంలోని మాడ్రన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటుచేసిన బుక్ డిపోలో భద్రపరిచమని తెలిపారు.
మిగతా పుస్తకాలు మరో నెల రోజుల్లో వచ్చే అవకాశముందని, 2018 సంవత్సరం నుంచి పుస్తకానికి ప్రత్యేక కోడ్‌ను ఏర్పాటుచేసి ఆ బార్‌కోడ్ ద్వారా ఆ పుస్తకం ఎక్కడ ఉందో కూడా తెలుసుకునేలా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు తీసుకుంది. దీంతో పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నమన్నారు.
ఏప్రిల్ నెలాకరు వరకు పూర్తిస్థాయిలో
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌తోపాటు వివిధ యాజమాన్యాలకు చెందిన రెసిడెన్షియల్, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు 961కు పైగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి వరకు సుమారు 80090 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారందరికీ పాఠ్యపుస్తకాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాకు ఇప్పటికే 1,67,140 పుస్తకాలు వ చ్చాయి. గత సంవత్సరం మిగిలిన 4206 పుస్తకాలు ఉన్నాయని 2,82,480 మిగతా పుస్తకాలు ఏప్రిల్ చివరికల్లా చేరే అవకాశముందన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి జిల్లాకు సుమారు 4,53,826 వరకు పుస్తకాలు అవసరం కానున్నాయని,
అక్రమాలకు చెక్ పెట్టేందుకు బార్‌కోడ్
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందన్నారు.
గతేడాది నుంచే జిల్లాలకు సరఫరా చేస్తున్న ప్రతి పాఠ్యపుస్తకానికీ బార్‌కోడ్ ఏర్పాటుచేసి విద్యార్థులకు సంబంధించిన ఆధార్‌ను సైతం లింకు చేస్తున్నమన్నారు. ఈ ఆధార్ లింక్‌ను ఆయా పాఠశాలల నుంచి సేకరించిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నంబరింగ్ ఇచ్చి ఆ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ఆ నంబరు పుస్తకమే చేరే విధంగా ప్రణాళిక రూపొందించామని డిఇవో తెలిపారు.
బహిరంగంగా ప్రభుత్వ పుస్తకాలు ఎక్కడైనా కనిపించినా ఆ బార్‌కోడ్ ప్రకారం సంబంధిత పాఠశాల హెచ్‌ఎంతోపాటు ఎంఈవోలను సైతం జిల్లా అధికారులు, ప్రభుత్వం బాధ్యులను చేసి చర్యలు తీసుకునే అవకాశముందని తెలిపారు
జిల్లాలో ప్రతి విద్యార్థికి పున ప్రారంభంరోజే పాఠ్యపుస్తకాల అందించే దిశగా ప్రణాళికలు రూపొందించామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. డిఇఓ వెంట టెస్ట్ బుక్ ఇంచార్జ్ మురళి కృష్ణ సెక్టోరల్ అధికారి నారాయణ సిబ్బంది సునీల్ సాయి చరణ్ ఉన్నారు