జిల్లాకు పెరగనున్న వ్యవసాయ బడ్జెట్‌

నేరుగా సబ్సిడీ పథకాల అందేత
రంగారెడ్డి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడిన వికారాబాద్‌ జిల్లా పరిధిలోనే అత్యధికంగా వ్యవసాయ సాగు ఉండడంతో రైతులకు యంత్ర పరికరాల సబ్సిడీ కింద సుమారు రూ.6 నుంచి 7కోట్లు కేటాయింపు జరిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈసారి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెరగనున్నట్లు తెలిసింది. కొత్త విధానంతో సబ్సిడీ డబ్బులు రైతులకు నేరుగా అందడంతో అక్రమాలు జరగకుండా నిరోధించవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. జిల్లా విషయానికి వస్తే గతంలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఉన్నపుడు సుమారు రూ.11కోట్ల యంత్ర పరికరాల సబ్సిడీగా కేటాయింపు జరిగేది. రైతుల ఇష్టానుసారం కొనుగోలుడీబీటీ విధానం అమలు చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీపై యంత్ర పరికరాలు సరఫరా చేస్తుండగా బయటి మార్కెట్‌లో రైతులు ఇష్టమైన వాటిని కొనుగోలు చేసేందుకు ఈ కొత్త విధానం ఉపకరిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా సబ్సిడీ విత్తనాల విషయంలో జరుగుతున్న అక్రమాలను పూర్తిస్థాయిలో నిరోధించాలని సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రతియేటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీ విత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది. కొందరు అక్రమార్కులు రైతుల పాసుపుస్తకాల పేరిట విత్తనాలు తీసుకువెళ్లడం, మరికొందరు సబ్సిడీ విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం వంటి అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వాటికి చెక్‌ పెట్టడానికే ప్రభుత్వం డీబీటీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రైతులకు ఎంత భూమి ఉన్నది, ఏ విత్తనాలు వేస్తారో వాటినే కొనుగోలు చేయడం ద్వారా వాటికి సంబంధించిన సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. మరోవైపు బయటి మార్కెట్‌లో లభించే విత్తనాల ధరలు, సబ్సిడీ విత్తనాల ధరలలో కొంతమేరకే తేడా ఉంటుండడం వల్ల కూడా కొందరు రైతులు బయటి మార్కెట్‌లోని విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మన్నికైన విత్తనాలు రైతులు నేరుగా బయటి మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొత్తగా డీబీటీ విధానాన్ని అమలు చేయడం ద్వారా రైతుకు మేలు కలుగుతుంది. ప్రభుత్వం అందజేసే సబ్సిడీ పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు చేరుతుంది. సబ్సిడీ విత్తనాలు పక్కదారి పడుతుండడం జరుగుతుంది. కొందరు అక్రమార్కులు సబ్సిడీ విత్తనాలను పక్కదారి పట్టించి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటన్నింటికీ చరమగీతం పాడవచ్చు. యంత్ర పరికరాల విషయంలోను సబ్సిడీ నేరుగా రైతులకు అందజేయడం వల్ల రైతుకు ఇష్టమైన కంపెనీకి చెందిన యంత్ర పరికరాలు కొనుగోలు చేయవచ్చు.