జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు ప్రజల సమస్యలపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉంది
-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 (జనంసాక్షి);
ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, సమస్యలకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై, ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు ప్రజల సమస్యలపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. సోమవారం ప్రజావాణికి మొత్తం 62ఫిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఆర్ డిఓ సాయన్న , జెడ్పి సీఈవో సాయాగౌడ్, ఏవో రవీందర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.