జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రాథమిక పరీక్ష

జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్

93.8% హాజరు నమోదు
జిల్లాలోని పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 7 : జిల్లాలో ఆదివారం నాడు నిర్వహించిన ఎస్.ఐ ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు ఉదయం 10 గం. నుండి మధ్యాహ్నం 1 గం. వరకు నిర్వహించారని, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రాథమిక పరీక్ష పోలీస్ నోడల్ అధికారిగా జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ , రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీ రాం మోహన్ ప్రశ్నాపత్రాల, ఓయంఆర్ పత్రాల పంపిణీ, బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలను పర్యవేక్షించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా విద్యుత్, ఫర్నీఛర్, గాలి, వెలుతురు, నీటి వసతి కోసం మంచి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4054 మంది అభ్యర్థులకు గాను 3805 మంది హాజరైనారు మరియు 249 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. 93.8% మంది అభ్యర్థులు హాజరు కాగా అందరు అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరును పూర్తి చేసినట్లు తెలిపారు . ఈ పరీక్షల నిర్వహణలో 270 మంది పరీక్ష నిర్వాహకులు, 70 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారని అన్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ గారు నవోదయ డిగ్రీ కళాశాల, MALD కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్, ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హై స్కూల్ లను సందర్శించి పరీక్ష జరిగుతున్న తీరును పరిశీలించారు.
ఎస్పీ వెంట జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్, గద్వాల్ సి. ఐ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.