జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

 

కలెక్టర్ అనురాగ్ జయంతి

మొత్తం అభ్యర్థులు 4226 , పరీక్షకు హాజరైన వారు 3520 – గైర్హాజరు అయినవారు 746

– 82.51 శాతం హాజరు

 

రాజన్న సిరిసిల్లబ్యూరో. అక్టోబర్ 16. (జనం సాక్షి) జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

ఆదివారం జిల్లాలోనీ అగ్రహారం లోని గ్రూప్-1 ప్రిలీమినరి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.
అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల , ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల నిర్వహణ, పరీక్ష నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 17 పరీక్షా కేంద్రాలలో మొత్తం 4226 అభ్యర్థులకు గానూ 3520 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 746 మంది ఆబ్సెంట్ అయ్యారని 82.51 శాతం హాజరు నమోదు అయినట్లు కలెక్టర్ తెలిపారు.పరీక్ష కేంద్రాల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి,ఆర్డీఓ పవన్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల లోని పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.