జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం

మంత్రి అప్పలరాజు

ఒంగోలు,నవంబర్‌11((జనంసాక్షి)): జిల్లాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని మంత్రి అప్పలరాజు ప్రకటించారు. అరకు పార్లమెంట్‌ను 2 జిల్లాలుగా చేయాలన్నది సీఎం జగన్‌ ఆలోచన అని చెప్పారు. జగన్‌ ఆలోచనకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పార్లమెంట్‌ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరంగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ డెయిరీలను టీడీపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ డెయిరీలను పునరుద్దరించేందుకు జగన్‌ చర్యలు చేపట్టారని తెలిపారు. ఈనెల 25 నుంచి ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలో పాలసేకరణ చేపడుతామని అప్పలరాజు ప్రకటించారు.రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు ఏర్పాటు చేసిన కమిటీకి ప్రత్యేక సబ్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్‌ వ్యవహారాల అధ్యయనానికి సబ్‌ కమిటీ-1… నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి సబ్‌ కమిటీ-2… ఆస్తులు, మౌలికసదుపాయాల అధ్యయనానికి సబ్‌ కమిటీ-3…. ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్‌ కమిటీ-4లను ఏర్పాటు చేసింది.