జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలి
టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్ పాషా
హుజూర్ నగర్ సెప్టెంబర్ 18 (జనం సాక్షి): అధికార పార్టీ నాయకులకు దాసోహంగా వ్యవహరిస్తున్న సూర్యాపేట జిల్లా ఎస్పీని
వెంటనే సస్పెండ్ చేయాలని టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండీ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పొగుడుతూ ప్రసంగాన్ని కొనసాగించడం యావత్ రాష్ట్ర ప్రజలకే సిగ్గుచేటు అని అన్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసు ఒక పార్టీ కే వంత పాడడంలో ఆంతర్యం ఏమిటో వెంటనే తెలపాలన్నారు.
అంతటితో ఆగకుండా మంత్రిని బాహుబలి తో పోలుస్తూ మంత్రి జగదీష్ రెడ్డి జయహో అంటూ నినాదాలు చేయడమే కాకుండా సభా ప్రాంగణ నీ దద్దరిల్లిలా నినాదాలు చేయాలంటూ పదేపదే కోరడం అధికార పార్టీ నాయకులకు దాసోహం చేయడంమనీ అన్నారు.
ఉన్నతమైన పదవిలో ఉండి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు పోలీస్ అధికారులు తల వంచి పనిచేయడం యావత్ పోలీస్ శాఖ కె మచ్చ తెస్తుందని తెలిపారు.
ఇలా వ్యవహరించిన జిల్లా ఎస్పీని వెంటనే శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలకు ఆదర్శంగా వ్యవహరించాల్సిన పోలీస్ అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఎస్పీ తీరును జిల్లా ప్రజలు తప్పుపడుతున్నారని గుర్తు చేశారు. తక్షణమే పైన పేర్కొన్న అంశాలను పరిశీలించి అతన్ని సస్పెండ్ చేయాలని, వెంటనే ఉన్నతమైన (ఐ.పి.ఎస్) అధికారిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.