జిల్లా ఏర్పాటు విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా:- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమ విషయాన్ని సమయ,సందర్భాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకెళ్తానని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మిర్యాలగూడకు విచ్చేసిన శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిని కలిసి జిల్లా ఏర్పాటు ఆకాంక్షను వివరించారు. జిల్లా ఏర్పాటు మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అని, నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ సాధన సమితి సభ్యులు ఆయన దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన సుఖేందర్ రెడ్డి జిల్లా ఏర్పాటును ఎవరు వ్యతిరేకించడం లేదని, కొత్తగా మిర్యాలగూడ జిల్లా ఏర్పడితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని దాన్ని హర్షిస్తాం అని అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్, బంటు వెంకటేశ్వర్లు చేగొండి మురళి యాదవ్, దాసరాజు జయరాజు, ధీరావత్ మాన్య నాయక్,, డి శంకర్ నాయక్, ఏ గోవింద నాయక్,జాగాటి శేఖర్, నాగేశ్వర రావు, వజ్రగిరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.