జిల్లా కాంగ్రెస్‌లో ఆదరణ కోల్పోతున్న ‘ఆనం’ వర్గం!
నెల్లూరు, జూన్ 16 (జనంసాక్షి) : శుక్రవారం నాడు వెలువడిన నెల్లూరు లోక్‌సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ మనుగడను జిల్లాలో ప్రశ్నార్థకం చేశాయి. 2009 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితం కాగా మొన్న జరిగిన ఉప ఎన్నికలు ఆనం సోదరుల మీద ఆధారపడే నిర్వహించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఉదయగిరి అసెంబ్లీ టిక్కెట్‌ను తొలుత ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా దాల జానకిరాంకు ఇవ్వాలని అధిష్ఠానం భావించి నప్పటికిి మంత్రి ఆనం పట్టుబట్టి కంభం విజయ రామిరెడ్డికి టిక్కెట్ ఇప్పించారు. కంభం విజయ రామిరెడ్డిని గెలిపించే మాట ఆలా ఉంచితే ఉదయగిరిలో కాంగ్రెస్ మూడవస్థానానికి పడిపో వడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. వైఎ స్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి తొలి రౌండ్ నుంచి మెజార్టీ తగ్గకుండా 75వేల 103 ఓట్లు పోల్ చేసుకుని 30 వేల 598 మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించగా రెండవస్థానంలో నిలిచిన తెలుగుదేశం పార్టీ 44 వేల 505 ఓట్లు సొంతం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 34 వేల 489 ఓట్లకే పరి మితమైంది. ఇక నెల్లూరు లోక్ సభ నియో జకవర్గం విషయానికి వస్తే జిల్లా పార్లమెంట్ చరిత్రలోనే 2లక్షల 91 వేల 745 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు 76 వేల 206 ఓట్లు సాధించారు.
అలాగే ఆనం వివేకా నందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 49 వేల 668 ఓట్లు, నెల్లూరు సీటీ నియోజకవర్గంలో 39 వేల 407 ఓట్లు సాధి ంచి ఆనం వర్గాన్ని కోలుకోలేని దెబ్బతీసారు. ఆన ం రాంనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరులోనే కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారు ణంగా తయారు అయిన నేపథ్యంలో ఆనం వర్గా నికి, ప్రత్యేకించి ఆనం రాంనారాయణరెడ్డికి సమా ధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆత్మ కూ రు నియోజకవర్గంలో మేకపాటి రాజమో హన్‌రెడ్డి 33 వేల 550 ఓట్లు మెజార్టీ సాధిం చడాన్ని పలిశీలిస్తే ఇక్కడనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని ప్రజలు చాలా వరకు తిరస్కరించినట్లు భావిం చాల్సింటుంది. అలాగే ముఖ్యమంత్రి తొలి ఎన్ని కల ప్రచారం కూ డా ఆత్మకూరులోనే ప్రారంభించినప్పటికీ ప్రజల్లో ఏ మాత్రం సానుకూలతను సాధించలేకపోయా రనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.ఈ పరిస్థితిని గమనిస్తే 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఆనం ఆత్మకూరు నుంచి పోటీ చేయక పోవచ్చుననే సంకేతాలు వెలవరించినట్లు అయి ంది. అలాగే ఆనం వివేకానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ మండలంలోను, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగర నియోజకవర్గంలోను కాంగ్రెస్ పరిస్థితి ఆత్మకూరు కంటే ఘోరంగా ఉండడంతో 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకు చెబుతున్నారు.
సహజంగా పత్రికల్లో కనిపించి ఉత్సాహంగా ఫోటోలు వేయిం చుకునేే ఆనం వివేకానందరెడ్డి శుక్రవారం మధ్యా హ్నం నుంచి కేవలం ఇంటికే పరిమితమై పో యారు. ఇక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అయితే ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండే పరి స్థితి లేదు. మొత్తం మీద ఈ ఉప ఎన్నికల్లో ప్రజ లు ఇచ్చిన ఆసాధారణ తీర్పు వల్ల కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడిప్పుడే కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.