-జిల్లా కేంద్రంలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.

-ఆకట్టుకున్న జానపద ప్రదర్శన.
-రాష్ట్ర ప్రభుత్వం అన్ని కళా రంగాలకు ప్రాధాన్యత నిస్తుంది.
-జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి.
-కళాకారులను అభినందించిన కలెక్టర్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు14(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోస్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.జిల్లా కేంద్రంలో ని
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా సాంస్కృతిక, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమా నికి జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెద్దపల్లి పద్మావతి బంగారయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రకాల కళా రంగాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు.ఈ రోజు జరిగిన కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయనని, ప్రతి పాఠశాల విద్యార్థులు ఎంతో చక్కగ తమ కళా ప్రదర్శనలు చేసారని కొనియాడారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా జిలా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంత తక్కువ సమయంలో అభ్యసన చేసి చాలా బాగా తమ కళా సమర్త్యాన్ని నిరూపించుకున్నారని కొనియాడారు.75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ జానపద కళాకారుల ప్రదర్శనలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కు సంబంధించిన 18 పాఠశాలల విద్యార్థులు పాల్గొని దేశభక్తి, జానపద పాటల పై నృత్య ప్రదర్శన చేశారు
అనంతరం ఈ కళా ప్రదర్శనలో పాల్గొన్న పాఠశాలల విద్యార్థులకు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మెమోంటోలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా పౌర సంబంధాల అధికారి, పి. సీతారాం, జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా బి.సి. సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఆర్డీఓ నాగలక్ష్మి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.