జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు.
ఇరుకుగా రోడ్లు పెరిగిన వాహనాల రద్దీ
పార్కింగ్ స్థలాలు కరువు
రోడ్లపైనే వాహనాల నిలిపివేత
ఆటో స్టాండ్ లకు చోటు కరువు
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కష్టాలు
వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి జూన్ 18
జిల్లా ఏర్పడినప్పటి నుంచి జిల్లా కేంద్రమైన వికారాబాద్ లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణం మీదుగా హైదరాబాద్, కర్ణాటక, రహదారి ఉండడంతో ప్రతినిత్యం వందల సంఖ్యలో వాహనాలు వీటికి తోడు భారీ వాహనాలు కూడా పట్టణంలో కి ప్రవేశించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ట్రాఫిక్ ను అదుపు చేయాల్సిన అధికారులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాలతో పాటు కారు ఆటో ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉదయం 9 నుంచి మొదలుకొని రాత్రి 9 గంటల వరకు రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలో కార్యాలయాలకు వివిధ పనులపై మార్కెట్లకు వచ్చే ప్రజలతో రోడ్లను కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
*ఎక్కడ చూసినా రద్దీ*
జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ ఫుట్ పా తుల పై వాహనాలు తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. చాలీచాలని రోడ్లతో ట్రాఫిక్ సమస్యకు దారి తీస్తున్నాయి. డివిజన్ కేంద్రంగా ఉన్న సమయంలోనే ప్రజలకు ఇబ్బంది గా మారిన ట్రాఫిక్ సమస్య జిల్లా కేంద్రం అయ్యేసరికి రెట్టింపయ్యాయి. జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతో వాహనాల తాకిడి పెరగడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా కేంద్రం ఏర్పడడంతో అటు జిల్లా స్థాయి అధికారుల వాహనాలు మండలాల నుంచి వచ్చిపోయే వారి వాహనాల తాకిడి పెరగడంతో రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆటో స్టాండ్ లకు అనువైన స్థలం లేకపోవడంతో రోడ్ల పైనే పార్కింగ్ చేస్తున్నారు. మొదలేే ఇరుకైన రోడ్లు వాటిపై నిర్వహిస్తున్న ఫుట్ పత్ వ్యాపారం కారణంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి .పాదచారులు సైతం అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం మీదుగా నిత్యం ఈ రహదారి వెంట వేలసంఖ్యలో ఇటు హైదరాబాద్ వైపు అటు కర్ణాటక తాండూర్ మోమిన్పేట్ సదాశివపేట సంగారెడ్డి వైపు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. రద్దీగా ఉండే ఈ రోడ్డుకు ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ట్రాఫిక్ సమస్యను పట్టించుకోక పోయినప్పటికీ జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలో ట్రాఫిక్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాన కూడళ్ళ వద్ద ట్రాఫిక్ కష్టాలు
జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లు అయినా ఎన్టీఆర్ చౌరస్తా, బి జె ఆర్ చౌరస్తా, ఎమ్మార్పీ చౌరస్తా, లో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రధాన కూడళ్లలో వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉండడంతో వీటి సమీపంలో ఆర్టిసి బస్టాండ్, రైల్వే స్టేషన్ ఉండడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లు విస్తారంగా లేకపోవడం ఇరువైపుల వ్యాపార సముదాయాలు ఉండడంతో వినియోగదారులు వస్తువుల క్రయ విక్రయాల కోసం వచ్చినప్పుడల్లా ద్విచక్ర వాహనాలను నాలుగు చక్రాల వాహనాలను రోడ్డుపై నుంచి తమ పనులను కొనసాగించాల్సిన పరిస్థితి ఉన్నాయి. వాహనాలను రోడ్లపైనే పార్కు చేయడంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
*పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్*
వికారాబాద్ జిల్లా కేంద్రంలో గతంలో ప్రధాన కూడళ్లు అయినా ఎన్టీఆర్ చౌరస్తా, బి జె ఆర్ చౌరస్తా, ఎమ్మార్పీ చౌరస్తా లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు.
ట్రాఫిక్ సమస్య పై దృష్టి సారించాలి.
పేరు. రాజేందర్ రెడ్డి వికారాబాద్
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ ఎక్కువ అవుతున్నది. రద్దీ పెరగడంతో రోడ్లపై వాహనాలను నడపాలని భయమేస్తుంది. అధికారులు దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి.
ఫోటోలు.
1.జిల్లా కేంద్రంలో రద్దీగా ఉన్న ప్రదేశం.
2. ఎన్టీఆర్ చౌరస్తా లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్
3. జిల్లా కేంద్రంలో వాహనాల రద్దీ.
4.
3 Attachments