జిల్లా కేంద్రంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు.
దుర్గామాతను దర్శించుకున్న బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్.
సరస్వతి దేవాలయంలో మహాలక్ష్మి దేవిగా అలంకరణ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్1(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అయోధ్య యూత్ అసోసి యేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతీష్టించిన దుర్గామాత అమ్మవారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి నేడనూరి దిలీపాచారి,పార్లమెంట్ ఇంచార్జ్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి దర్శించుకు ని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వ హించారు.వారిని అయోధ్య యూత్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శు లు నెలికొండ సుధీర్ చందు గౌడ్ , కొవ్వూరి సంతోష్ కుమార్ లు శాలువలతో సన్మానిం చారు.అయోధ్య యూత్ అసో సియేషన్ యువత సభ్యులు పాల్గొన్నారు.శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో మహాలక్ష్మి దేవిగా అలంకరించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పెంటమరాజు నవీన్ తెలిపారు. ఆలయంలో దుర్గామాతను మహాలక్ష్మి దేవికి ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని వేద బ్రాహ్మణులు తిరునగరి పవన్ కుమార్ చార్యులు నాగర్ కర్నూల్ కు చెందిన దొడ్ల రాజవర్ధన్ రెడ్డి ,రాధ, ఉల్పరకు చెందిన శ్రీధర్ రెడ్డి శ్రావ్య దంపతులచే ప్రత్యేకంగా లక్ష్మి,సరస్వతి హోమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మహిళలచే బతుకమ్మ ఆటలు పాటలు పాడారు. అనంతరం సామూహిక భోజనాలు నిర్వహించారు. ఎలిమే ఈశ్వరయ్య, దొడ్ల నారాయణరెడ్డి, శివశంకర్, ఇందుమతి,మాధవి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సంత బజార్ లోని సూర్యవంశం ఆర్య కటిక భవాని దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.పట్టణం లోని కటిక వంశీయులు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు అమ్మవారికి నిర్వహించి ప్రత్యేక ప్రసాదాల నివేదన చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు,భోజన పంపిణీ చేశారు.రెబల్ యూత్ అసోసియేష న్ వారి ఆధ్వర్యంలో నవదుర్గలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు దయాకర్ రెడ్డి,శివశంకర్ తెలిపారు. మైల్ స్టోన్ యూత్ ఆధ్వర్యంలో దుర్గఅమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీదరిపల్లి విష్ణు వర్ధనాచార్యులుచే పూజలు నిర్వహిం చారు.బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్,దిలీప్ ఆచారి అమ్మవారిని దర్శించుకున్నారని మైల్ స్టోన్ యూత్ అధ్యక్షులు నరేష్ తెలిపారు.రాంనగర్ కాలనీలోని రామాలయంలో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు రాజు,ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ పాల్గొన్నారు.ఆదివారం నాడు శ్రీజ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రత్యేక అక్షరాభ్యాసాలు, అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఆదివారం ఉన్నందున ఈ ప్రాంతంలో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులను, విద్యార్థులను అమ్మవారి దర్శనం చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.అక్షరాభ్యాసంలో పాల్గొన్న వారికి , భక్తులకు భోజన వసతి ఆలయం లో ఉన్నట్లు ఆలయ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆయన కోరారు.