జిల్లా కేంద్రాలన్నీ ఇక మున్సిపల్‌ కార్పోరేషన్లు

ఇసుక తరలింపుతో ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయం
ఏడు మిషన్లపై సుదీర్ఘంగా చర్చించిన ఎపి కేబినేట్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి16( జ‌నంసాక్షి ): రాష్ట్ర అభివృదద్ది లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలను ఆంధప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ తీసుకుంది. సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలోఎ అనేక అంశాలను చర్చించారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలపై దీర్ఘంగా చర్చలు జరిపింది.అనంతరం సమాచారశౄఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వివరాలు వెల్లడించారు. మున్సిపల్‌ కమిషనర్‌ల అధికారాలు పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఏడు మిషన్‌ల తీరుపై సుదీర్ఘ

చర్చ చేశారు.  అదనపు కార్పొరేషన్‌ల ఏర్పాటుపై చర్చ కూడా సాగింది.  ఈ నెల 19న నీరు- చెట్టు కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం  తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో సిఎం దీనిని ప్రారంభిస్తారు.  ఇసుక ధరల తగ్గింపుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సీఎం సూచన మేరకు అందరికీ అందుబాటులోకి తీసుకుని రానున్నారు.  నీటిపారుదల శాఖను జలవనరుల శాఖగా మార్పునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.ఎపిలో ప్రతి జిల్లా కేంద్రాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌ గా మార్చాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.అంతేకాక మున్సిపాల్టీలలో మూడు గ్రేడ్లు మాత్రమే ఉండాలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.మున్సిపల్‌ కమిషనర్లకు ప్రత్యేక అదికారాలు ఇవ్వాలని కూడా మంత్రివర్గం తీర్మానించింది. దేవాలయల పాలకమండలుల కాల పరిమితిని ఒక ఏడాదికి పరిమితం చేయాలని కూడా నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నరు. అంతేకాక ఎర్రచందనం వేలం కు కృషి చేయాలని కూడా భావించారు. ఇసుక వేలం పాటలలో ,రీచ్‌ ల విషయాలలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోరాదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సూచించారు. ఎపిలో ఐదు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. కొత్త ఇసుక రీచ్‌లు గుర్తించి ఆదాయం పెంచాలని సీఎం ఆదేశించారు. ఇసుకను లభ్యతలేని ప్రాంతాలకు తరలించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించారు.  వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోనున్నట్లు మంల్రి పల్లె  తెలిపారు.  55 నియోజక వర్గాల్లో పశువుల కొట్టాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు.  పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు వారంలో శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.  అనంతపురం, పశ్చిమగోదావరి, చిత్తూరులో బిందు, తుంపర సేద్యం 90 శాతం పెంచాలని నిర్ణయించారు.   సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూడాలని మంత్రి వర్గం నిర్ణయించింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సమస్యల పరిష్కారంపై చర్చించాలని నిర్ణయించారు.  కృష్ణపట్నం రైల్వే ప్రాజెక్టు భూకేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలపై చర్చ జరిగింది. ప్రత్యక్షంగానే ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు, సీఎంకు సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు మున్సిపల్‌శాఖను ఆదేశించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మున్సిపాలిటీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించామని, అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని మార్చారని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రుల సూచన మేరకు విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఇరు రాష్టాల్ర మధ్య విభేదాలుంటే అభివృద్ధి సాధ్యం కాదనే, ఓ మెట్టు దిగి చర్చలకు వెళ్లానని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులకు వివరించారు. కేబినెట్‌ సమావేశం అనంతరం చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. ఇక నుంచి వారానికి రెండు రోజులు జిల్లాల్లో పర్యటించాలని, హాస్టళ్లలో బస చేయాలని, ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. వచ్చే ఏడాదికి బెరైటీస్‌ గనులు అమ్మకాల ద్వారా రూ. 2వేల కోట్ల ఆదాయం వచ్చేలా ప్రణాళిక రచిస్తున్నామని బాబు తెలిపారు. 55 నియోజకవర్గాల్లో పశువుల హాస్టళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచాలని, మున్సిపాలిటీల బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచాలని అధికారులకు, చంద్రబాబు సూచించారు. ఆంధప్రదేశ్‌కు ఇంధన విశ్వవిద్యాలయం మంజూరు చేసేందుకు కేందప్రభుత్వం

సుముఖంగా ఉందని మంత్రులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రైతులను ప్రోత్సహించడంలో భాగంగా అనంతపురం, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో డ్రిప్‌ స్పింకర్లకు 90శాతం సబ్సీడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాబు తెలిపారు. మార్చిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన జరుగుతుందని వైద్యశాఖ మంత్రి కామినేని ఈ సందర్భంగా వెల్లడించారు.