జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొసీడింగ్ ఖాతర్ చేయని జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 5 (జనం సాక్షి);
తెలంగాణ రాష్ట్రంలోని వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టుల వారి పిల్లలకు ఉచిత విద్యని అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రోసిడింగ్ ను లెక్క చేయడం లేదని జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేటు స్కూల్ యజమాన్యం పై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి మహమ్మద్ సిరజుద్దీన్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆయనతో చర్చలు జరిపి జర్నలిస్టుల పిల్లలకు ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేటు స్కూల్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చర్యలు తీసుకోకపోతే
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని టి డబ్ల్యూ జె ఎఫ్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు బి. గిరిబాబు హెచ్చరించారు.
డీఈఓ జర్నలిస్టులకు సానుకూలంగా స్పందించి త్వరలో ప్రైవేటు స్కూల్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మీ సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో
సీనియర్ జర్నలిస్ట్ పెద్ద ఇస్మాయిల్, హెచ్. శ్రీనివాసులు, రవికుమార్, తీర్థ చారి, సురేష్, రమేష్ బాబు, బిమేష్ తదితరులు పాల్గొన్నారు.