జిల్లా వైద్యాధికారి అత్యవసర సమావేశం.

ములుగు జిల్లా బ్యూరో, జూలై 26(జనంసాక్షి):-

ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ములుగు వారి చాంబర్లో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే వైద్యాధికారులతో, వైద్య సిబ్బందితో డాక్టర్ అప్పయ్య సమావేశము నిర్వహించడం జరిగింది. ఇందులో డాక్టర్ విపిన్ డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ,/డి ఐ ఒ/ఆర్బిఎస్కే జిల్లా కోఆర్డినేటర్, ఆర్ బి ఎస్ కె వైద్యాధికారులు డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ జయప్రద , డాక్టర్ శ్రీనివాస్ ,డాక్టర్ శ్రీలత ,డాక్టర్ నర్సింగ్ రావు , డాక్టర్ పుష్పలీల , డాక్టర్ బండి శ్రీనివాస్ , డాక్టర్ అభినందన్ రెడ్డి ,డాక్టర్ స్వప్న, డాక్టర్ ఉమా మహేశ్వరి, డాక్టర్ నరహరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్ బి ఎస్ కే బృందాలకు అవసరాన్ని బట్టి మెడికల్ క్యాంపులను నిర్వహించడం, కోవిడ్ వాక్సినేషన్ లో చురుకుగా పాల్గొనడం, స్కూళ్లలో మెడికల్ క్యాంపులను నిర్వహించడం చేయాలని డాక్టర్ అప్పయ్య సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సిన్ తరలించుటకు ఆర్బీఎస్కే వాహనాలను షిఫ్టు పద్ధతిలో ఉపయోగించాలని కోరారు. పాఠశాల మెడికల్ క్యాంపులలో స్పెషాలిటీ అవసరం ఉన్న విద్యార్థులకు జిల్లా ప్రదాన ఆసుపత్రి ములుగు తీసుకెళ్లాలని సూచించారు. ఆర్ బి ఎస్ కే వైద్యాధికారులకు వారి అవసరాన్ని బట్టి క్యాంపులలో ఇచ్చే చికిత్సలు మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నుండి తీసుకోవాలని కోరారు. స్కూల్లో క్యాంపులో స్పెషాలిటీ అవసరం అయిన విద్యార్థులకు చికిత్స కల్పించి దాని యొక్క సమాచారంను ఎప్పటికప్పుడు ఆన్లైన్ డాటా ఎంటర్ చేయాలని ఆదేశించారు. షిఫ్ట్ పద్ధతిలో ఉన్న ఆర్బిఎస్కే టీమ్స్ కాకుండా మిగతా టీమ్స్ ప్రోటోకాల్ ప్రకారం విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.