*జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలు ప్రారంభించిన ఎస్ఐ
లింగంపేట్ 09 అక్టోబర్ (జనంసాక్షి)
లింగంపేట్ మండలం సజ్జన్ పల్లి గ్రామంలో ఆదివారం ఎస్సై శంకర్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలను ప్రారంభించారు.సజ్జన్ పల్లి గ్రామంలోని గ్రామఅభివృద్ది కమీటి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కబడి క్రీడలకు జిల్లాలోని వివిద మండలాల నుండి 30 కబడ్డి టీంలు పాల్గొన్నాయని సర్పంచ్ పుట్టి పోచయ్య తెలిపారు.కబడ్డీ క్రీడల్లో గెలుపొందిన ప్రథమ జట్టుకు 10 వేలరూపాయలు,ద్వితీయ స్థానంలో నిలిచిన కబడ్డీ జట్టుకు 5 వేల రూపాయల ప్రైజ్ మనీ బహుకరిస్తామని పేర్కోన్నారు.కబడ్డీ క్రీడా కారులను ఎస్ఐ,శంకర్, గ్రామసర్పంచ్ పోచయ్య పరిచయం చేసుకున్నారు. అనంతరం సజ్జన్ పల్లి కబడ్డీ క్రీడాకారులతో ఎస్ఐ శంకర్ కబడ్డీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ఆటల్లో రాణిస్తు క్రీడల్లో మంచి ప్రతిభ నైపుణ్యం కనబరుస్తు క్రీడల్లో పాల్గొనలన్నారు ఎలాంటి గొడవలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో కబడి క్రీడలో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల క్రీడాకారులు ఉపసర్పంచ్ రవిందర్ గౌడ్,ఎస్ఎంసి చైర్మన్ సిద్దిరాములు,మాసన్న గారి కిష్టయ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail