జీవన్ ప్రమాణ్‌కు కౌంటర్లు ఏర్పాటు చేయాలి
గోదావరిఖని, నవంబర్ 11, (జనంసాక్షి) :
సింగరేణి రిటైర్డ్ కార్మికులు జీవన్ ప్రమాణ్ పత్రాలను సమర్పించడానికి బ్యాంకుల్లోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఎఐవైఎఫ్ పెద్దపల్లి జిల్లా ప్రధానకార్యదర్శి మద్దెల దినేష్ పేర్కొన్నారు. రిటైర్డ్ కార్మికులు పెన్షన్ పొందడానికి ప్రతి సంవత్సరం నవంబర్‌లో జీవించి ఉన్నట్లుగా జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. గతంలో ఉన్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ పరిణామంతో జీవన్ ప్రమాణ్ అనే పద్దత్తిని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రిటైర్డ్ కార్మికుల అవస్థలను గమనించి స్థానికంగా వున్న బ్యాంకుల్లోనే ప్రతి సంవత్సరం నవంబర్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి సహకరించాలని దినేష్ కోరారు.



