జీవాలకు నట్టల మందులు పంపిణీ

టేకులపల్లి ,జూన్ 8( జనం సాక్షి): పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుండి జీవాలకు నట్టల మందులు పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 14 వరకు నిర్వహించనున్నట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ వి సంతోష్ తెలిపారు. అందులో భాగంగా బుధవారం మండలంలోని కోయగూడెం, లాక్యాతండా, మేళ మడుగు గ్రామాలలో జీవాలకు నట్టల మందులు పంపిణీ చేశారు.  కోయగూడెం లో జీవాలకు నట్టల మందు జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సురేందర్, కోయగూడెం సర్పంచ్ ఉమా సురేందర్ వారి చేతుల మీదుగా జీవాలకు మందు తాగించారు. ఈ సందర్భంగా గా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ జీవాలకు, పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ఇస్తున్న మందులను తాగించి సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. జిల్లా పశువైద్య ,పశుసంవర్ధక శాఖ అధికారి మాట్లాడుతూ జీవాలకు నట్టల మందులు తప్పకుండా తగ్గించాలని, జీవాలలో నట్టలను నిర్మూలించు కపోతే ఎదుగుదల ఆగిపోతుందని, బరువు తగ్గుతుంది, రక్తహీనత లోపిస్తుంది అని తెలిపారు. గ్రామాలలో రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జీవాలు, పశువులు రోగాల బారిన పడకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య సిబ్బంది రైతులు పాల్గొన్నారు.