జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలి

-టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి ,సెప్టెంబర్ 21( జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 అలోకేషన్లో అన్యాయానికి గురై కోర్టు ద్వారా న్యాయం చేయాలని ఉత్తర్వులు తెచ్చుకున్న స్పౌజ్ ఉపాధ్యాయులందరికీ , జీవో 317 అలోకేషన్లో అన్యాయానికి గురై న్యాయం చేయాలని అప్పిళ్లు చేసుకున్న ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు .కొందరికే న్యాయం చేసి మిగతా వారికి అన్యాయం చేయడం సరైనది కాదని, మిగిలిన 13 జిల్లాలలోని స్పౌజ్ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టేకులపల్లి మండలంలోని పలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో చర్చించి వారి సమస్యలను సేకరించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు జీవో 317 బాధిత స్పౌజ్ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నిరసన, ఆందోళన చేయడం జరుగుతుందని ,దీనికి జీవో 317 బాధిత స్పౌజ్ ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరయి విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు ఈ దసరా సెలవులలో జరపాలని, అన్ని పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని,సిపిఎస్ ను రద్దుచేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని,పాఠశాలలకు గ్రాంట్లు విడుదల చేయాలని,గిరిజన సంక్షేమ కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాలని, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు సొసైటీ స్కేల్స్ మంజూరు చేయాలని, సి ఆర్ టి లను రెగ్యులర్ చేయాలని, ఉపాధ్యాయులకు,సి ఆర్ టి లకు ప్�