జుక్కల్ నియోజకవర్గంలో నూతన మండలం
హర్షం వ్యక్తం చేసిన మండల వాసులు
బిచ్కుంద జులై 24 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని
మద్నూర్ మండలంలో గల డోoగ్లీ గ్రామానికి మండలంగా అధికారంగా ప్రకటన రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడం చేశారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ మాధవి శశాంక్ పటేల్ డోoగ్లీ గ్రామానికి మండలంగా ప్రకటించడంతో 13 గ్రామ పంచాయతీల ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు గ్రామాలకు మహార్దశలు ఏర్పడటం జరుగుతుందని తెలిపారు . డోoగ్లీ చుట్టూ ఈ 13 గ్రామాలు 5 కిలో మీటర్ల లోపల ఉండటంతో ఆయా గ్రామ ప్రజలకు అన్ని సౌకర్యాలు, సదుపాయాలు సకాలంలో అందటం జరుగుతుందని తెలిపారు. మద్నూర్ మండలంగా ఉన్నప్పుడు 20 కిలో మీటర్ల దూరం నుండి ప్రయాణం చేసి మండల అధికారుల కార్యాలయాలకు వెళ్లి నానా తంటాలు పడ్డారని తెలిపారు. గ్రామాలకు తిరిగి వెళ్లాలంటే బస్సు సౌకర్యాలు, ఆటోలు కూడా సమయంలో ఉండక పోవడం వలన అనేక గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలిగాయని తెలిపారు. ఎంపీ బి.బి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కృషితో ప్రజల కోరిక మేరకు డోoగ్లీ గ్రామానికి మండలం హోదా కల్పించడంతో గ్రామ అభివృద్ధితో పాటు ఇక్కడ ఆయా శాఖల కార్యాలయ సౌకర్యాలు, ఆసుపత్రి సౌకర్యాలు, విద్యాలయాలు, తదితర సౌకర్యాలు ఏర్పడి మండల సంబంధిత గ్రామాలకు సౌకర్యాలు కలగటం జరుగుతుందని తెలిపారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ఆదేశాలు వెలువడంతో ఆదివారం నాడు సర్పంచ్ మాధవి శశాంక్ పటేల్ కు గ్రామస్తులు మిఠాయిలు తినిపించి సంబురాలు నిర్వహించుకోవడం జరిగింది . ఆదివారం ఉదయం నుండి ఆయా గ్రామనికి చెందిన వారు సర్పంచ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు తినిపించారు. గ్రామ అభివృద్ధి కొరకు స్థానిక సర్పంచ్ మాధవి శశాంక్ పటేల్ గ్రామ అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి వహించి విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, సదుపాయాలు గ్రామ ప్రజలకు కలుగే విధంగా త్వరలో కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. డోoగ్లీ గ్రామానికి మాధవి శశాంక్ పటేల్ వరుసగా రెండు సార్లు అన్ని వర్గాల వారి సహకారంతో సర్పంచ్ గా విజయం సాధించి ప్రజల యొక్క మన్ననలను పొందటం జరిగింది. మండలంగా ఏర్పడి అనేక నిధులతో గ్రామ అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.