జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసు

సామూహిక అత్యాచారంలో నలుగురు మైనర్లకు బెయిల్‌

హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ పబ్‌ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ మంజూరు చేసింది. అందులో ముగ్గురు మైనర్లు జువైనల్‌ హోం నుంచి విడుదలయ్యారు. మరో మైనర్‌ కు బెయిల్‌ వచ్చినా కొన్ని కారణల వల్ల విడుదల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు నిందితుల బెయిల్‌ తిరస్కరించిన బోర్డు ఈ సారి షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసులో పోలీసులకు సహకరించడంతో పాటు హైదరాబాద్‌ డీపీవో ముందు ప్రతినెల హాజరుకావాలని ఆదేశించింది.
మరో మైనర్‌ అయిన ఎమ్మెల్యే కొడుకుకు మాత్రం జువైనల్‌ జస్టిస్‌ బోర్డు బెయిల్‌ నిరాకరించింది. దీంతో అతడు హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నాడు. అయితే హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ ఇంకా పెండిరగ్‌ లోనే ఉండడంతో జువైనల్‌ హోంలోనే ఉండనున్నాడు. ఇక ఏ1 నిందితుడైన సాదుద్దీన్‌ కు కోర్టు బెయిల్‌ ఇవ్వలేదు.

తాజావార్తలు