జైపూర్‌లో తొలి మహిళా పోస్టర్‌!

జైపూర్‌ : మరో పురుషాధిక్య రంగంలో తొలి మహిళ ప్రవేశించింది. అయితే ఇది గర్వంతో చెప్పుకోదగిన అంశం కాదు.. పేదరికం మహిళల చేత ఎంత కఠినమైన పనైనా చేయింస్తుందనడానకి నిదర్శనమే ఇది. లేకపోతే బరువులు మోసే పోర్టరు వృత్తిని 33ఏళ్ల మహిళ ఎందుకు చేపడుతుంది? ముగ్గురు పిల్లల తల్లి అయిన మంజుదేవి రాజస్థాన్‌లోని జైపూర్‌ రైల్వే స్టేషన్‌లో పోర్టరుగా రైల్వే శాఖ అధికారుల నుంచి గుర్తింపు పత్రం పొందింది. ఆమె భర్త మహదేవ్‌ పోర్టరుగా పనిచూస్తూ అనారోగ్యంతో మృతిచెందాడు. చదువులేని ఆమకు బిడ్డల్ని పోషించడానికి మరో మార్గం కన్పించలేదు. అందుకే భర్త స్థానంలో ఆమెను పోర్టరుగా ఉంచడానికి వారు అంగీకరించారు. తోటి పోర్టర్లుంతా తనకు ఎంతో సహకరిస్తున్నారని, తాను కాస్త స్థిరపడగానే సోదరుడి దగ్గర ఉంచిన పిల్లల్ని తీసుకొచ్చి చదివించుకుంటానని ఆమెకురూ. 100 నుంచి 150 వరకూ లభిస్తోందట. ఆ ఆదాయంతో ఆ అమాయకురాలు ముగ్గురు బిడ్డల్ని పెంచి, చదివించాలని ఆశిస్తోంది!