జొకోవిచ్‌కు టాప్‌ సీడింగ్‌

లండన్‌ జూన్‌ 22 (జనంసాక్షి):

వింబుల్డన్‌ గ్రాండ్‌ శ్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో నొవాక్‌ జొకొవిచ్‌కు టాప్‌ సీడింగ్‌ లభించింది. ఆండీ ముర్రే, రోజర్‌ ఫెదరర్‌ వరుసగా రెండు, మూడు సీడెడ్‌ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతుండగా, ఇటీవల ప్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించి, కెరిర్‌లో 12వ శ్లామ్‌ను అందుకున్న రాఫెల్‌ నాధల్‌ ఐదో సీడ్‌గా ఆడనున్నాడు. స్పెయిన్‌కే చెందిన డేవిడ్‌ ఫెరర్‌ నాలుగో సీడ్‌గా నాదల్‌ కంటే మెరుగైన స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. హహిళలు విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌కు టాప్‌ సీడింగ్‌ దక్కింది. విక్టోరియా అజరెంకా, మరియా షరపోవా రెండు. మూడు స్థానాల్లో ఉన్నారు. రేపటి నుంచి వచ్చేనెల 7వ తేది వరకూ జరిగే వింబుల్డన్‌ ప్రస్తుత ప్రపంచ ర్యాకింగ్స్‌తో పాలు, గ్రాస్‌ కోర్టులో ఇటీవల చూపిన ప్రతిభాపాటవాల ఆధారంగా ర్యాకింగ్స్‌ను కేటాయించారు. గత ఏడాది లుకాస్‌ రొసొల్‌ టోర్నమెంట్‌లో కాలి గాయం కారణంగా రెండో రౌెండ్‌ నుంచే నిష్క్రమించిన నాదల్‌ అ తర్వాత గ్రాస్‌ కోర్టులపై అంతగా రాణించలేదు. మరోవైపు పెరర్‌ ఎవరూ ఊహించని రీతిలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. గత ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్‌ పైనల్స్‌ వరకూ చేరినా అతను ఈ సారి నాలుగో సీడ్‌గా ఆడనున్నాడు. అతను ఇప్పటికే హెర్టోజిన్‌బొచ్‌ గ్రాస్‌ కోర్టు టైటిల్‌ను కూడా తన ఖతాలో చేర్చుకున్నాడు. ఫలితలాన్ని ఊహించిన విధంగానే వస్తే, నాదల్‌ క్వార్టర్స్‌ ఫైనల్స్‌ 2011 ఛాంపియన్‌ జొకొవిచ్‌ లేదా ఏడు పర్యాయాలు వింబుల్డన్‌ గెల్చుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌ లేదా 1936లో ఫ్రెడ్‌ పెర్రీ తర్వాత వింబుల్డన్‌ టైలిల్‌ను సాధించిన తొలి బ్రిటిషర్‌గా రికార్డు నెలకొల్పాలన్న పటుట్దలతో ఉన్న ముర్రేతో తలపడాల్సి ఉంటుంది.