జోగులాంబ అభివృద్ధికి నిధులున్నా పనులు జరగడం లేదు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అలంపూర్ జనం సాక్షి ( సెప్టెంబర్ 26) మహా శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసాద్ స్కీమ్ నిధులు మంజూరు చేయించినప్పటికీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సోమవారం సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ నిర్వహణాధికారి పురేందర్ కుమార్, చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి,ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఉభయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ వ్యవసాయానికి ఇచ్చే కరెంటు పక్క రాష్ట్రాలు ఎన్ని గంటలు ఇస్తున్నాయని కాదు,నీవు ఎన్ని గంటలు ఇస్తున్నావ్ చెప్పుఅన్నారు.
తెలంగాణ నుంచి తిరుపతికి విమానంలో వెళ్లిన ఒక మంత్రి అనంతపూర్ లో వ్యవసాయానికి వచ్చే కరెంటు గురించి మాట్లాడాడట, విమానంలో ఎక్కడ, ఎట్లా మాట్లాడాడు,అక్కడ మూడు గంటలకు ఒకసారి తర్వాత మూడు గంటలకు ఒకసారి వ్యవసాయానికి విద్యుత్ అని చెప్పడం, మీరు చెప్పే అబద్ధాలు మానుకోవాలని విమర్శించారు.
పక్క రాష్ట్రాల్లో గురించి అపనిందలు వద్దు,
అమ్మవారి సాక్షిగా చెప్తున్న సిద్దిపేట నుంచి దుబ్బాక వరకు నీవు ఎక్కడ వ్యవసాయానికి అంతరాయం లేకుండా 24 గంటలు కరెంటు ఎక్కడ ఇచ్చావు అన్నారు.తెలంగాణలో ఇండ్లకు వ్యవసాయానికి టూ పేస్, త్రీఫేస్ తేడా చూపకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని, వ్యవసాయానికి మాత్రం ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే ఇస్తున్నారన్నారు.తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని, నిరూపిస్తే మీరు వేసే ఏ శిక్ష కైనా మేము సిద్ధంఅన్నారు. ఈనియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో నా కొడుకు పోటీ చేయాలా,నీ కొడుకు పోటీ చేయాల్నా , పక్క నియోజకవర్గానికి చెందిన పాటలు పాడి ,ఆటలాడే వాళ్లు పోటీ చేయాలన్న విషయం పక్కనపెట్టి, ఆ విషయం తర్వాత చూద్దాం,ముందు నియోజకవర్గం గురించి ఆలోచించండిఅన్నారు.
ఈ నియోజకవర్గానికి వచ్చే ఇతర పార్టీ నాయకులనే కాకుండా, సొంత పార్టీ నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి అన్నారు. దీని వెనక మీ కుమారుడే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పద్ధతి మార్చుకోవాలి అన్నారు.