జోరుగా టిఆర్‌ఎస్ ఇంటింటి ప్రచారం
మల్హర్,నవంబర్ 12,(జనంసాక్షి) ;మండలంలోని కుంభంపల్లి కొయ్యూరు రాఘయ్యపల్లి గ్రామాల్లో ఆదివారం తెరాస అభ్యర్థి పుట్ట మధుకర్ కూతురు పుట్ట మౌనిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్దిని అందించిన సంక్షేమ పథకాలను చూసి మరోసారి
మా నాన్నను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈకార్యక్రమంలో తెరాస మండల అద్యక్షుడు ఎండి తాజుద్దిన్ జెడ్పీటిసి గోనె శ్రీనివాసరావు యాదగిరిరావు సుదర్శన్‌రెడ్డి గ్రామ శాఖ అద్యక్షుడు ముత్తయ్య సురేష్ తోపాటు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గోన్నారు.