జ్యుడీషియల్ కస్టడీకి చండిలా
న్యూఢిల్లీ ,జూన్ 20 (జనంసాక్షి) :
స్పాట్‌ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ అజిత్ చండిలాకు ఢిల్లీ కోర్ట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీస్ కస్టడీ పూర్తవడంతో ఇవాళ కోర్టులో హాజరపరచగా… 12 రోజులు జ్యూడిషియల్ కస్టడీకి పంపిస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. దీంతో జూలై 2 వరకూ చండిలా తీహార్ జైలులోనే గడపనున్నాడు. గత మూడు రోజులుగా అతన్ని విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. బుకీలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడంతో పాటు సహచర క్రికెటర్లను ఫిక్సింగ్‌లోకి దించినట్టు చండిలా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చండిలాతోపాటు అరెస్టయిన మరో ఇద్దరు క్రికెటర్లు శ్రీశాంత్ , చవాన్ ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే చండిలాకు మాత్రం న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.