టాటా విరాన్ పేరుతో నకిలీ అమ్మకాలు
ఏకకాలంలో దాడులు చేసిన పోలీసులు
నెల్లూరు,అగస్టు21(జనంసాక్షి): టాటా విరాన్ తన చైన్ లింక్ ఫెన్స్‌లు, బార్బ్‌డ్ వైర్ ఒరిజినల్ ఉత్పత్తులను ఆధీకృత డీలర్లు, డిస్టిబ్యూట్రర్ల వద్ద విక్రయించబడుతుంటాయి.. అయితే నెల్లూరు జిల్లాలోని పలు
ప్రాంతాల నుంచి టాటా విరాన్ చెయిన్ లింక్ ఫెన్స్‌లు మరియు బార్బ్‌డ్ వైర్ ఉత్పత్తులను ప్రామాణీకరణ ప్యాకేజీలో లేకుండా విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో వేదాయపాలెం పోలీస్‌స్టేషన్, వీ సతారం పోలీస్‌స్టేషన్, సిదాపురం పోలీస్‌స్టేషన్ల పోలీసుల సహకారంతో ఏక కాలంలో నాలుగు ప్రాంతాల్లో ఉమ్మడిగా దాడులు చేశారు. ఆధీకృతం కాకుండా టాటా విరాన్ పేరును వినియోగించడం టాటా స్టీల్ హక్కులను ఉల్లంఘించడమే అని చెప్పారు. ఈ స్టోర్ల సోర్‌ట్ల యజమానులు నకిలీ చెన్‌లింక్ ఫెన్స్ మరియు బార్బ్‌డ్ వైర్లను నాణ్యత లేకుండా విక్రయించడంతో పాటుగా వాటిని టాటా విరాన్ ఉత్పత్తులుగా వెల్లడిరచి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఒకే రోజు పలు ప్రాంతాలలో ఆంధప్రదేశ్ పోలీసుల సహకారంతో ఈ దాడులను సంయుక్తంగా నిర్వహించడంతో పాటుగా పలు కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.