టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్టేల్రియా
నాగ్‌పూర్,మార్చి5(జనంసాక్షి): భారత్, ఆస్టేల్రియా మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్టేల్రియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టర్నర్, బెహ్నెడ్రార్ఫ్‌ల స్థానంలో షాన్ మార్ష్, నాథన్ లైయన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు ఫించ్ చెప్పాడు. మరోవైపు భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వివరించాడు. ఈ మ్యాచ్‌లోనూ ఆసీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. రెండో వన్డేలో గొప్పగా రాణించి సిరీస్‌లో బోణీ కొట్టాలని కంగారూలు ఆశిస్తున్నారు.భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, జడేజా, కుల్దీప్ యాదవ్, షవిూ, బుమ్రా
ఆస్టేల్రియా జట్టు: స్మాన్ ఖవాజా, అరోన్ ఫించ్, షాన్ మార్ష్, మార్కస్ స్టాయినీస్, హాండ్స్‌కాంబ్, మాక్స్‌వెల్, అలెక్స్ కేరీ, కౌల్టర్ నైల్, కమిన్స్, లైయన్, జంపా.