టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్

హోబార్ట్:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ ల్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆసీస్ మరోసారి ఇంగ్లండ్ ను మట్టికరిపించాలని భావిస్తోంది.

అయితే ఇంగ్లండ్ మాత్రం ఆసీస్ పై తొలి మ్యాచ్ లో ఓడినా..  మూడో వన్డేలో  టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఈ సిరీస్ లో ఇంతవరకూ టీమిండియా ఖాతా తెరవకపోవడం గమనార్హం.