టిఆర్ఎస్ తోనే గ్రామాల అభివృద్ధి
హుజూర్ నగర్ అక్టోబర్ 23 (జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కర్కాయల గూడెంలో రూ. 2 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పల్లెల్లో మంచినీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, నిర్మాణాలు ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కీత జయమ్మధన మూర్తి, ఎంపీటీసీ మచ్చా వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, దొంగరి అరుణ సత్యనారాయణ, గొట్టెముక్కుల నిర్మల, బత్తిని మాధవరావు, చింతకుంట్ల వీరబాబు, కల్పన లక్ష్మీనారాయణ, ఎర్ర భిక్షం , సంగతి లక్షణన్న, పిల్లుట్ల ఈరయ్య, డైరెక్టర్ అంకతి శ్యామ్ సింగ్, డైరెక్టర్ కాంతమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area