టిఆర్ఎస్ పార్టీకి ఎనలేని ఆదరణ.. అందరి చూపు తెలంగాణ వైపు
ఎమ్మెల్యే బాలకిషన్..
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 15
యావత్ భారతదేశం చూపు తెలంగాణ వైపే ఉందని టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారని, తెలంగాణలో అన్ని వర్గాలు ఆదరిస్తున్నట్లు మానకొండూర్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం లోని శంకరపట్నం మండలంలో గల కాచాపూర్ తాడికల్ ముత్తారం గద్దపాక కొత్తగట్టు గ్రామాలతో పాటు పలు గ్రామాల్లోని యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండలం తాడికల్ శివారు నుండి కేశవపట్నం శివారులోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో నిర్వహించిన చేరికల కార్యక్రమానికి జాతీయ రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, అనంతరం మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి పేద కుటుంబాలను ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్నారని, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ పార్టీని దేశంతో పాటు తెలంగాణలో ఆదరిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజల సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చారని, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ, పేరుతో దేశ ప్రజలకు కేసీఆర్ సేవలందించనున్నట్లు వెల్లడించారు. శంకరపట్నం మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, పెద్ద ఎత్తున పార్టీలో చేరడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులి కోట రమేష్, సర్పంచుల పూర్ మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, సర్పంచులు రాజయ్య, భద్రయ్య, మానస, రజిత, వెంకటరమణారెడ్డి, రవి ,కిషన్ రావు, విజయ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీలు మోయిన్, సంపత్, టిఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి, శ్రీనివాస్, సంపత్, తిరుపతిరెడ్డి, తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు ,టిఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.