టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు

పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించిన మంత్రి, ఎమ్మెల్యే – పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలి
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ అక్టోబర్ 10 (జనం సాక్షి):
సూర్యపేట జిల్లా కాంగ్రెస్ ఎస్ టీ సెల్ అధ్యక్షుడు, బిల్యా నాయక్ తండా మాజీ సర్పంచ్, ధరవత్ నవీన్ నాయక్ సోమవారం మునుగోడు పట్టణంలో హుజుర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి అద్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం నవీన్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో జరుగుతున్న అభివృద్ధికి, శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీలకతీతంగా వివక్షత లేకుండా సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే నాయకత్వం ఇవన్నీ తనని టిఆర్ఎస్ వైపుకు ఆకర్షితుడై పార్టీ లో చేరడం జరిగిందని అంకితభావంతో మంత్రి, ఎమ్మెల్యే నాయకత్వంలో పని చేస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమము లో హుజుర్ నగర్ నియోజక వర్గ టీ ఆర్ ఎస్ పార్టీ ఎస్ టీ సెల్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.