టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జెఎస్ఆర్ రాజీనామా

21న మునుగోడు లో జరిగే బహిరంగ సభలో బీజేపీ లో చేరుతున్నట్టు వెల్లడి
హుస్నాబాద్ ఆగస్టు 19(జనంసాక్షి) :వృక్ష ప్రసాద దాత హుస్నాబాద్ స్థానికులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తిరుమల గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆశయాలు అయిన నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ఈ ప్రాంతం అభివృద్ధిచెందుతుందని
గత ఎన్నికలలో టీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపారు.అయితే ప్రజల ఆశయాలు వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 8 సంవత్సరాలలో కనీసం సచివాలయానికి వెళ్లకుండా దొరల పాలన సాగిస్తున్నారనీ, మిగిలిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు వారికి వంత పాడుతున్నారు.సింగాపురం నుండి వచ్చిన స్థానికేతరుడైన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు ఈ ప్రాంతంపై సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నారని అన్నారు.ఎమ్మెల్యే చేతగానితనం అసమర్థత వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు.నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న సిద్దిపేట్,హుజురాబాద్ నియోజకవర్గాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే చేతగానితనం,అసమర్ధత కాదా అని అన్నారు.2004 నుండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నానని , ఏనాడూ పదవులను అషించలేదని , 2014 సంవత్సరంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని శాశ్వత సమస్యలు పరిష్కారమై ప్రజలు సంతోషంగా వుంటారని భావించానని తెలిపారు. దానికి భిన్నంగా కేవలం ప్రజాప్రతినిధులు వారి అనుచరులు మాత్రమే బాగుపడ్డారని దీని వల్ల సామాన్యులకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు మరియు వారి అడుగులకు మడుగులొత్తే వాళ్లు మాత్రమే రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందారని ఉద్యమకారులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.8 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న అన్ని గ్రామాల పేర్లు తెలుసుకోలేకపోవడం, గ్రామాల సమస్యలు గుర్తించడంలో విఫలం కావడం, కనీసం ముఖ్య నాయకులను పేరుపెట్టి పలకరించే పరిస్థితిలో లేకపోవడం చాలా విచార కరం అని అన్నారు. ఎమ్మెల్యే వివిధ గ్రామాలను పర్యటిస్తూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తూ అదే అభివృద్ధి అనే భ్రమలో ఉన్నారని అన్నారు.ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కనీస అవగాహన లేకుండా గ్రామాలను ఇష్టం వచ్చినట్లు విభజించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.బిజెపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజాకర్షకపథకాలకు ఆకర్షితుడినై హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బిజెపి పార్టీలో చేరుతున్నానని.పార్టీలో అన్ని వర్గాలను కలుపుకుని పనిచేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా ,మరియు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి సైనికుడిగా పని చేస్తానని దీనికి ప్రజల అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.