టిఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయి

వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే

హావిూలను అమలు చేయలేకపోవడంతోనే నిలదీతలు

తమ పొత్తులపై వారికి ఎందుకు భయమన్న పొన్నం

కరీంనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌, బీజేపీలు గల్లంతు కావడం ఖాయమని కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్తి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అందుఎకే ఈ రెండు పార్టీలు మహాకూటమిపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కూటమి సీట్ల పొత్తుపై ఆ పార్టీకు ఎందుకు భయమన్నారు. తాము అధికరాంలోకి వస్తం గనకనే టిక్కటెల్‌ కోసం పోటీ పెరిగిందని అన్నారు. ప్రజల్లో వస్తున్న మార్పు దీనికి సంకేతమన్నారు. అందుకే తమపై నోరు పారేసుకుంటున్నారని సోమవారం నాడిక్కడ అన్నారు. వచ్చే ఎన్నికల తరవాత టిఆర్‌ఎస్‌, బిజెపిలు చేతులు కలుపుతాయని కాంగ్రెస్‌ నేత, అన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా నిశ్శబ్ద విప్లవం రానుందని తెలిపారు. ఈసారి కేసీఆర్‌ 50 శాతం సీట్లు సాధించే ప్రశ్నే లేదని, అధికారంలోకి వచ్చే ప్రస్తకే లేదన్నారు. బీజేపీకి ఇప్పుడున్న ఐదు స్థానాలు

దక్కవన్నారు. తామే ప్రత్యామ్నాయం అంటూ లేని గాంభీర్యాన్ని ఆ పార్టీనేతలు ప్రకటిస్తున్నారని అన్నారు.

అధికారం కోసం కెసిఆర్‌ కేసీఆర్‌ బీజేపీ, ఎంఐఎంలను ఆశ్రయించారని, ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు కాంగ్రెస్‌ గెల్చుకుంటుందని, తమకు ఖచ్చితంగా 80 స్థానాలు వస్తాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలు ప్రకటించాక పరిస్తితి మారడంతో ఇప్పుడు కేసీఆర్‌కు భయం పట్టుకుందని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయంపై ఆయన పాశ్చాత్తాపం పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ఓట్లను ఎంఐఎం చీలుస్తుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఆ పార్టీ ఎటువంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు, ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ వంటి హావిూలను కేసీఆర్‌ తుంగలో తొక్కారని అన్నారు. అందుకే ప్రజలు ఎక్కడిక్డక ఇప్పుడు టిఆర్‌ఎస్‌ నేతలను నిలదీస్తున్నారని విమర్శించారు. ప్రజలు కెసిఆర్‌ హావిూలను నమ్మి ఓటేయడం వల్లనే ఆనాడు కేసీఆర్‌ గెలిచారని చెప్పారు. ఈ వాగ్దానాలను అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు అవినీతిమయం అయ్యాయని ఆరోపించారు. కేసీఆర్‌, ఆయన కుటుంబం అవినీతి చిహ్నంగా మారారని విమర్శించారు. ఎన్నికలు సవిూపిస్తున్న కొద్దీ ప్రజలు తమ అసంతృప్తి పెరుగుతోందన్నారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్‌ కూటమిని నమ్ముతున్నారని పొన్నం అన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. టిడిపితో పొత్తును విమర్శించే వారు తమ వైఫల్యాలను ప్రజల ముందు అంగీకరించాలన్నారు.