టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యం

జీవన్‌రెడ్డితో ఒరిగిందేవిూ లేదు

తనను గెలిపిస్తే నియోజకవర్గ సేవచేస్తా: సంజయ్‌ కుమార్‌

జగిత్యాల,నవంబర్‌10(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేసిందని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి వల్ల ఈ ప్రాంతానికి ఒరిగిందేవిూ లేద్నారు. ఇక్కడా టిఆర్‌ఎస్‌ ఎ/-మెల్యే ఉండివుంటే గత నాలుగేళ్లలో మరింత అభివృద్ది చోటుచేసుకుని ఉండేదన్నారు. ప్రచారంలో భాగంగా పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇస్తే జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మాయాకూటమిని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను అధికారంలో నుంచి దింపడమే లక్ష్యంగా జత కట్టిన మహాకూటమిని మట్టి కరిపించడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌కు, 16 ఎండ్లు పాలించిన టీడీపీకి ప్రజల సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కాకం చూపాలన్న ఆలోచనే రాలేదన్నారు. ప్రతి రైతుకు రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులకు 24 గంట ఉచిత విద్యుత్‌ రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేసిన్నట్లు పేర్కొన్నారు.