టిఆర్‌ఎస్‌లో చేరిన ముత్యం రెడ్డి అనుచరులు
సిద్దిపేట,నవంబర్22(జనంసాక్షి): జిల్లాలోని దుబ్బాక నిజయోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 500 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. చేగుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీళ్లంతా ముత్యంరెడ్డి అనుచరులు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్ దుబ్బాక అభ్యర్థి రామలింగారెడ్డి పాల్గొన్నారు. ముత్యంరెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.




