టిక్కెట్‌ ఇవ్వకున్నా పోటీ మాత్రం ఖాయం: బోడిగె శోభ

కరీంనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): అధికార టిఆర్‌ఎస్‌ తనకు టిక్కటెల్‌ ఇవ్వకున్నా బరిలో దిగుతానని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రకటించారు. ఈ సీటుపై కెసిఆర్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకట చేయకుండా ఆమెను మా/-తరం పక్కన పెట్టారు. ఏకైక దళిత మహిళనైన తనకే కేసీఆర్‌ చొప్పదండి టికెట్‌ ఇస్తారని టీఆర్‌ఎస్‌ నేత బొడిగె శోభ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం రామడుగు మండలం వెలిచాలలో కుల సంఘాల పెద్దలతో శోభ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు టికెట్‌ ఇవ్వకపోయినా పోటీ చేయమంటున్నారని తెలిపారు. అభ్యర్థి పేరు ప్రకటించాక కార్యాచరణ ప్రకటిస్తానని బొడిగె శోభ స్పష్టం చేశారు. ఇప్టపికే ఆమె ప్రచారంలో దూసుకుని పోతున్నారు. తనకు టిక్కెట్‌ ఇవ్వక పోవడంపై ఆమె కెసిఆర్‌ను నిలదీస్తున్నారు. పార్టీలో 16 ఏళ్లుగా పనిచేస్తున్నానని అన్నారు.