టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షునిగా జాజుల స్వామి గౌడ్

మునుగోడు సెప్టెంబర్ 25(జనం సాక్షి): మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన టిడబ్ల్యూజేఎఫ్ మునుగోడు నియోజకవర్గ మహాసభలో జాజుల స్వామి గౌడ్ ను మునుగోడు నియోజకవర్గ అధ్యక్షునిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈకార్యక్రమానికి టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గాదే రమేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి బాదిని నరసింహ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని అన్నారు మునుగోడు నియోజకవర్గం నూతన కమిటీని నిర్మాణం చేపట్టారు. వారితోపాటు ప్రధాన కార్యదర్శిగా చిలువేరు అంజయ్య ,కోశాధికారిగా చిలువేరు సంజీవ,ఉపాధ్యక్షులుగా కొర్రె మురళి,బాలరాజు,బోయపల్లి రమేష్,సహాయ కార్యదర్శిగా జీడిమెడ్ల నరేష్, కాటేపాక శంకర్,గాదె వినోద్ కుమార్,తదితరులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన స్వామి గౌడ్ మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎప్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.