టీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి చేరికలు…
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చాడ శ్రీనివాస్
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్25(జనంసాక్షి) అక్కన్నపేట మండల బీజేపీ అధ్యక్షులు గోళ్లపల్లి వీరాచారి ఆధ్వర్యంలో గుబ్బిడి గ్రామంలోని పలువురు టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలను హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో 8 సంవత్సరాలుగా పాలన గాడి తప్పి,అభివృద్ధిలో వెనుకబడి,పారాయి వ్యక్తి చేతిలో కూని అయిపోయిందని విమర్శించారు.గౌరవెళ్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా,రైతులను జైలుకు పంపిన అసమర్థ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని అన్నారు.గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్రాలాతో కోట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే, హుస్నాబాద్ నియోజకవర్గంలో పరాయైన సతీష్ పాలనలో హుస్నాబాద్ మగ్గి, అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.
Attachments area