టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి ‘ఈటల’నే మరోసారి ఆశీర్వదించండి

– మండలంలోని పలు గ్రామాలలో పార్టీ నాయకుల, కార్యకర్తల ఇంటింటా ప్రచారం

వీణవంక(జనంసాక్షి):తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్‌: ప్రభుత్వం బలపరిచిన హుజురాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి ఈటల రాజేందర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వీణవంకలో జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అద్యక్షుడు మారుముళ్ల కొమురయ్య, మోటం వెంకటేష్‌, ఎంఏ హమీద్‌, దాసారపు రాజు, గెల్లు మల్లయ్య దాసారపు రాధ, క్రిష్ణ, మందల రాజయ్య, అఖిల్‌ గౌడ్‌, గొర్రె రాజమౌళి, సమ్మిరెడ్డి తదితరులు ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్‌ మానిఫెస్టోలో పొందుపరిచిన అంశాల గురించి ప్రజలకు వివరించారు.అలాగే మండలంలోని బేతిగల్‌ గ్రామంలో మండల రైతు అధ్యక్షుడు నరహరి, తిరుపతి రెడ్డి, గొర్రె రాజమౌ

లి, మందల రాజయ్య, గొట్టిముక్కల రవీందర్‌రావు, వవినీలా సత్యనారాయణ, తిరుపతిరెడ్డి, శ్రీరాం ఐలయ్య తదితర నాయకులు మాట్లాడుతూ ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌

మండల అభివృద్ధి ఎంతగానో కృషి చేశారని, అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబందు, రుణమాఫీ, రైతుబీమా, పేదల కోసం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, మహిళల కోసం కేసీఆర్‌ కిట్‌ తదితర సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారన్నారు. కాబట్టి ఈటల రాజేందర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.