టీఎస్ పాలిసెట్ ఫలితాల్లో జయ విద్యార్థుల ప్రతిభ

టీఎస్ పాలిసెట్ ఫలితాల్లో జయ విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): బుధవారం వెలువడిన టీఎస్ పాలిసెట్ – 2022 ఫలితాల్లో తమ స్కూల్ కు చెందిన కందిబండ వెంకటేష్ స్టేట్ 8వ ర్యాంక్ , మద్ది హర్షిణి స్టేట్
10వ ర్యాంక్ , మునుకుంట్ల లాస్యశ్రీ  స్టేట్ 98వ ర్యాంక్ సాధించినట్లు స్థానిక జయ ఒలంపియాడ్ స్కూల్ కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, స్కూల్ డైరెక్టర్లు బింగి జ్యోతి , జెల్లా పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను , ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు , సహకరించిన పేరెంట్స్ కు వారు అభినందనలు తెలిపారు.