టీచర్లకు ఇంగ్లీషులో శిక్షణ

విజయవాడ,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆంగ్ల స్జబెక్టును బోధిస్తున్న జిల్లాలోని నలుగురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఒక నెల శిక్షణ కోసం బెంగళూరులోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ ఇన్‌ సౌత్‌ఇండియాకు పంపిస్తోంది. ఈనెల 19 నుంచి మార్చి 20వరకు ఈ శిక్షణ జరగనుంది. తర్ఫీదు అనంతరం ఆ సంస్థ ధ్రువపత్రాన్ని ప్రదానం చేయనుంది. ప్రాథమికస్థాయిలో ఆంగ్లబోధనను మెరుగుపర్చాలన్న లక్ష్యంగా ఉపాధ్యాయులను దశలవారీగా శిక్షణనిప్పిస్తామని డీఈవో కె.నాగేశ్వరరావు చెప్పారు. జిల్లాలోని పెడన మండలం తోటమూల ప్రాథమిక పాఠశాల  ఎంపికచేసి పంపిస్తున్నారు.