టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం:చంద్రబాబు

 

మహబూబ్‌నగర్‌: తమ హయాంలో ప్రతి ఏటా ఉపాద్యాయ నియామకాలు ఏటా నిర్వహించామని టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బీఈడీ విద్యార్థులకు పాత పద్దతిలోనే ఎస్‌జీటీ అవకాశం కల్పిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో సాగుతున్న చంద్రబాబునాయుడి పాదయాత్ర కాసేపటికి వడ్డేపల్లి మండలం 26వ కాలువ వద్దకు చురుకుంది. అక్కడ ఉల్లిగడ్డ రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ పాలనలో నాశనమైన వ్యవస్థను పునరుద్దరించాల్సిన అవసరముందన్నారు