టీవీ`డీ1 ఫ్లయిట్‌ టెస్ట్‌ ప్రయోగం విజయవంతం

` వెహికల్‌ ధ్వనివేగంతో దూసుకెళ్లింది:ఇస్రో చైర్మెన్‌
` పరీక్ష సక్సెస్‌ కావడం పట్ల హర్షం
` పలు కారణాలతో రెండు గంటలు ఆలస్యంగా ప్రయోగం
శ్రీహరికోట(జనంసాక్షి):గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా నిర్వహించిన టీవీ`డీ1 ఫ్లయిట్‌ టెస్ట్‌ ప్రయోగం సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ టీవీ`డీ1 మిషన్‌ రాకెట్‌ దాదాపు ధ్వని వేగం కన్నా అధిక వేగంతో దూసుకెళ్లినట్లు ఇస్రో చైర్మెన్‌ సోమనాథ్‌ తెలిపారు. టీవీ`డీ1 పరీక్ష సక్సెస్‌ కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ను పరీక్షించడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టామన్నారు. టీవీ`డీ1 వెహికల్‌ మ్యాక్‌ వేగంతో అంటే ధ్వని వేగంతో దూసుకెళ్లినట్లు వెల్లడిరచారు. నింగిలోకి వెళ్లిన తర్వాత.. అన్ని ప్రక్రియలు సవ్యంగా సాగినట్లు ఆయన తెలిపారు. మూడు పారాచూట్ల సాయంతో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌ బంగాళాఖాతంలో దిగినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా మరిన్ని వివరాలను వెల్లడిరచనున్నట్లు సోమనాథ్‌ తెలిపారు.టీవీ`డీ1 పరీక్ష వాయిదా వేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడిరచారు. 8 గంటలకు వెదర్‌ సరిగా లేని కారణంగా పరీక్షను 8.45 నిమిషాలకు వాయిదా వేసినట్లు చెప్పారు. అయితే 8.45 నిమిషాల సమయంలో ఇంజిన్‌ ఇగ్నిషన్‌ లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే ఆ లోపాన్ని గుర్తించారు. ఆటోమెటిక్‌ లాంచ్‌ సీక్వెన్స్‌ కంప్యూటర్‌ సంకేతాల ద్వారా పరీక్షను వాయిదా వేశారు.థ్రస్టింగ్‌ లోపం వల్ల ప్రయోగాన్ని నిలిపాల్సి వచ్చింది. చాలా వేగంగా రాకెట్‌లో మళ్లీ వాయువులను నింపామని, మిషన్‌ కంప్యూటర్‌ సంకేతం ఇచ్చిన తర్వాత రాకెట్‌ను రిలీజ్‌ చేసినట్లు వెల్లడిరచారు. రెండు గంటలు ఆలస్యంగా ప్రయోగం జరిగినా.. ఆ ఫలితాలు ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందాన్ని నింపింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం చేస్తున్న ప్రయోగాలను మరింత ఊతం దక్కింది. అనుకున్నట్లు పేలోడ్స్‌ సముద్రంలో దిగినట్లు సోమనాథ్‌ తెలిపారు. గగన్‌యాన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా 400 కిలోవిూటర్ల దూరంలో ఉన్న భూకక్ష్యకు వ్యోమగాముల్ని తీసుకెళ్లేందుకు ఇస్రో ప్లాన్‌ చేస్తోంది. మూడు రోజుల పాటు ఆ వ్యోమగాములు ఆ కక్ష్యలో గడపనున్నారు. 2025లో గగన్‌యాన్‌ పరీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నాయి.