టీ ట్వంటీ ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో పాటిన్‌సన్‌కు నో ప్లేస్‌

మెల్‌బోర్న్‌, జూలై 18 (జనంసాక్షి) : టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌ జాబితాలో ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ పాటిన్‌సన్‌కు చోటు దక్కలేదు. 30 మందిలో పాటిన్‌సన్‌పై వేటు అందరనీ ఆశ్చరపరిచింది. గత కొంత కాలంగా టెస్టుల్లో ఆసీస్‌కు కీలకంగా మారిన ఈ ఫాస్ట్‌బౌలర్‌ ఇప్పటి వరకూ 4 టీ ట్వంటీలు మాత్రమే ఆడాడు. పాటిన్‌సన్‌ కుంటే డిర్క్‌నాన్స్‌, బెన్‌లాలిన్‌లకే సెలక్టర్లు ప్రాధాన్యతనిచ్చారు. అలాగే స్పిన్నర్‌ నాథన్‌ ల్యాన్‌ను కూడా పక్కన పెట్టారు. అతని కంటే అల్‌రౌండర్‌ మ్యాక్‌వెల్‌ పైనే సెలక్టర్లు నమ్మకముంచారు. టెస్ట్‌ బౌలర్‌గా ముద్రపడిన ల్యాన్‌ కంటే ఫీల్డింగ్‌లో చురుగ్గా కదలడం మ్యాక్స్‌వెల్‌కు కలిసొచ్చింది. 23 ఏళ్ల మ్యాక్స్‌వెల్‌ ఇటీవలే జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. వచ్చే ఆగష్టులో పాకిస్థాన్‌తో జరగనున్న సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు. అల్‌రౌండర్‌గా జట్టులో కీలకం కానుండడంతో అతన్ని ఎంపిక చేశారు. అలాగే రెండేళ్లుగా ఆసీస్‌కు ఆడని డిర్క్‌నాన్స్‌, సీపర్‌ బెన్‌ లాలిన్‌ కూడా చోటు దక్కించుకున్నారు. 36 ఏళ్ల నాన్స్‌ ఇటీవల కౌంటీ టీ ట్వంటీల్లో నిలకడగా రాణించాడు. కొత్తగా రాబ్‌ క్వినీని కూడా ఆసీస్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే రెండేళ్లుగా టీ ట్వంటీలు ఆడని పీటర్‌ సిడెల్‌, బొల్లింజర్‌లకు జాబితాలో చోటు దక్కలేదు. ఇంగ్లాండ్‌ డొమెస్టిక్‌ టీ ట్వంటీ టోర్నీలో రాణిస్తోన్న ఫిలిప్‌ హ్యూజ్‌ను సెలక్టర్లు పట్టించుకోలేదు. తాము ఎంపిక చేసినట్టు చీఫ్‌ సెలక్టర్‌ ఇన్వెర్టీ చెప్పారు. కాగా ఆగష్టు 18లోగా ఆసీస్‌ తమ తుది 15 మంది జాబితాను ప్రకటించనుంది.

టీ ట్వంటీ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ప్రాబబుల్స్‌ : జార్జ్‌ బెయిలీ, ట్రావిస్‌ బిర్ట్‌, డానియల్‌ క్రిస్టియన్‌, పాట్‌ కమ్మిన్స్‌, జావియర్‌ డోహెర్టీ, జేమ్స్‌ ఫాల్కనీర్‌, ఆరోన్‌ ఫించ్‌, ర్యాన్‌ హ్యారిస్‌, బెన్‌ హిల్ఫెనాస్‌, బ్రాడ్‌ హగ్‌, డేవిడ్‌ హస్సీ, మైకేల్‌ హస్సీ, మిఛెల్‌ జాన్సన్‌, బెన్‌ లాలిన్‌ మిఛెల్‌ మార్ష్‌, షాన్‌ మార్ష్‌, గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌, క్లింట్‌ మెక్‌కే, డిర్క్‌నాన్స్‌, స్టీఫెన్‌ ఒకీఫే, టిమ్‌ పెయిన్‌, రాబ్‌ క్వీనీ, స్టీవ్‌ స్మిత్‌, మిఛెల్‌ స్టార్క్‌ ఆడమ్‌ వోగ్స్‌, మాథ్యూవేడ్‌, డేవిడ్‌ వార్నర్‌, షేన్‌ వాట్సన్‌, కామెరూన్‌ వైట్‌