టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్‌ షురూ

దుబాయ్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): భారత్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్‌కు

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కౌంట్‌డౌన్‌ ఆరంభించింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ ట్రోఫీని గురువారం దుబాయ్‌లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్ని, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. 2021 సెప్టెంబరున్ఖవంబరుల్లో పొట్టికప్‌ జరగనుంది. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో కూడా ఐపీఎల్‌ 2020ని సమర్థంగా నిర్వహించిన బీసీసీఐ, యూఏఈ బోర్డులను మను సాహ్ని అభినందించాడు.మేం సిద్ధం ఎలాంటి అవాంతరం లేకుండా వచ్చే ఏడాది భారత్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అన్ని దేశాల్లాగే భారత్‌ కూడా కరోనా కోరల్లో ఉన్నప్పటికీ.. టోర్నీ సమయానికల్లా పరిస్థితుల్లో మార్పు ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆటగాడిగా ఐసీసీ ఈవెంట్లను బాగా ఆస్వాదించా. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించే మెగా టోర్నీలో ఎలాంటి ఉత్సాహభరిత వాతావరణం ఉంటుందో నాకు తెలుసు. ప్రతిష్ఠాత్మక టోర్నీ నిర్వహణలో పరిపాలకుడిగా నా పాత్ర పోషిస్తా’ అని దాదా అన్నాడు. ‘మెగా టోర్నీకి మరో 12 నెలలు మాత్రమే ఉండడంతో.. దుబాయ్‌లో బీసీసీఐతో కలసి ట్రోఫీని ఆవిష్కరించాం’ అని ఐసీసీ తెలిపింది. ఇక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నిర్వహణలో రాజీపడబోమని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. ‘టీ20 ప్రపంచకప్‌లో ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత విషయంలో బీసీసీఐ అస్సలు రాజీపడదు. గొప్ప క్రికెట్‌ వీక్షణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాం. ఆతిథ్యానికి భారత్‌ పెట్టింది పేరు. ఐసీసీ, సభ్య దేశాలు మరిచిపోలేని ఆతిథ్యం అందిస్తాం’ అని జై షా హావిూ ఇచ్చారు. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్ని మాట్లాడుతూ మెగా ఈవెంట్‌ ప్రేక్షకుల సమక్షంలో జరగాలని ఆశించాడు. ‘ఇటీవల కొన్ని క్రికెట్‌ బోర్డులు నిర్వహిస్తున్న టోర్నీలు, ఐపీఎల్‌ విజయవంతమైన అనుభవాలతో టీ20 ప్రపంచకప్‌ కూడా జరుగుతుంది. 2016 తర్వాత భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ కావడంతో ఈ ఈవెంట్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది. టోర్నీ సజావుగా జరిగేందుకు భారత బోర్డుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో టోర్నీని ఆరోగ్య, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని సాహ్ని తెలిపాడు. వాస్తవంగా ఈ ఏడాది అక్టోబర్‌న్ఖవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆస్టేల్రియాలో జరగాల్సింది. కరోనా వైరస్‌ వల్ల దానిని 2022కు వాయిదా వేశారు. ఇక 2021 ఎడిషన్‌ షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌న్ఖవంబర్‌లో భారత్‌లో జరగనుంది. 2021 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌, ఆస్టేల్రియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, అఎ/-గానిస్థాన్‌, ఐర్లాండ్‌, నవిూబియా, నెదర్లాండ్స్‌, ఒమన్‌, పపువా న్యూగినీ, స్కాట్లాండ్‌ జట్లు తలపడతాయి.