*టూరిజం అభివృద్దిలో మాధవరం చెరువు సందర్శన*

మునగాల, జూలై 29(జనంసాక్షి): అమెరికాకు చెందిన సింపుల్ గ్రూప్ బోటింగ్ కంపని ప్రతినిధులు శుక్రవారం మునగాల మండలం మాధవరం చెరువును టూరిజం అభివృద్దిలో భాగంగా పరిశీలించారు. ఇప్పటికే ఈ కంపని ప్రతినిధులు సూర్యాపేట సద్దుల చెరువుకు సంబంధించి టూరిజం మరియు బోటింగ్ ప్రతిపాదనలు జిల్లా మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డికి అందించారని ప్రముఖ ఎన్నారై, టిఆర్ఎస్ నాయకులు జలగం సుధీర్ తెలిపారు. అంతేగాక కంపనీకి సంబంధించిన బోట్ లతో సద్దుల చెరువులో 3 రోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించారన్నారు. జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న మాధారం చెరువును కూడ పరిశీలించి ఒక రిపోర్ట్ ను జిల్లా కలెక్టర్ కు, జిల్లా మంత్రికి అందిస్తామని కంపెనీ సి.ఈ.ఓ జి.పాపారావు మరియు కోదాడ నాయకులు జలగం సుధీర్ తెలిపారు.